ప్రజా సమస్యలు పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అన్నిఏరియా ఆస్పత్రుల సూ పరింటెండెంట్లు, వైద్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆస్పత్రుల పనితీరు, అభివృద్ధి పనులు, ఆరోగ్యశ్రీ సేవలపై సమీక్షించారు. సమస్యలు, సిబ్బంది, వైద్యుల కొరత, ఆరోగ్య శ్రీ సేవలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నూతన నిర్మాణా లు, మరమ్మతులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించాలని చెప్పారు. మౌలిక సదుపాయాల మెరుగుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రులపైనే విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు తగిన శానిటేషన్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల పనితీరు, రక్త నిల్వల వివరాలను పరిశీలించి అత్యవసర సేవలకు లోటు లేకుండా చూడాలని సూచించారు., ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. సికిల్ సెల్ అనీ మియా కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూ చించారు. డీసీహెచ్‌ఓ రవిబాబు, ఏరియా ఆస్పత్రు ల సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికా రులు పాల్గొన్నారు.
61.25 శాతానికి ఎస్‌ఐఆర్ ప్రక్రియ
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో జిల్లాలో ఇప్పటికే 61.25 శాతానికి చేరుకుందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. రాష్ట్రముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి హా జరైన అంకిత్ మా ట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్నివిభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. రాజకీ య పార్టీల ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ బూత్ లెవెల్ ఏజెంట్ల నియమిస్తామన్నారు. అదనపు కలెక్టర్ డీ వేణుగోపాల్, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసా ద్, సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.
గుండాల: క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. శని వారం ఆళ్లపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మండలాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. భూ భారతిలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించా లని ఆదేశించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి ఎదురయ్యే సమస్యలపై ఆరాతీశారు. అనంతరం కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కిచెన్, స్టోర్, రూములను పరిశీలించారు. విద్యుత్ సమస్య నివారణకు ఇన్వర్టర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆళ్లపల్లిలో ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసి ల్యాబ్, మందుల గదులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సైవలపై ఆరా తీశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం సరిగ్గా ఉండటం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. మెనూపాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు జగదీశ్వర్ ప్రసాద్, శ్రీను, లాల్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


