గ్రంథాలయంలో ఎమ్మెల్యే సభ్యత్వం | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయంలో ఎమ్మెల్యే సభ్యత్వం

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

టేకులపల్లి: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా టేకులపల్లి శాఖా గ్రంథాలయంలో లైబ్రేరియన్‌ ఆర్‌.నాగన్న ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు సాగుతోంది. శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన సతీమణి కోరం లక్ష్మి అధికారికంగా సభ్యత్వాన్ని స్వీకరించారు. లైబ్రేరియన్‌ వారికి సభ్యత్వ రశీదులను అందజేశారు.

అస్మిత యోగాసన పోటీల్లో ప్రతిభ

చుంచుపల్లి: న్యూఢిల్లీ ఆనందాశ్రమంలో మార్చి 31 వరకు నిర్వహించిన అస్మిత యోగాసన నేషనల్‌ లీగ్‌ పోటీల్లో జిల్లా ప్రతినిధులు ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రధానంగా లక్ష్మిదేవిపల్లి చాతకొండకు చెందిన బుట్టి ప్రమీల జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. మహిళల ఆరోగ్యం, క్రీడా అభివృద్ధికి అస్మిత లీగ్‌ ఎంతో ఉపయోగకరంగా మారాయన్నా రు. బుట్టి ప్రమీలకు జిల్లాకు చెందిన పలువురు యోగా ప్రముఖులు అభినందనలు తెలిపారు.

వృద్ధుడికి

అండగా నిలిచిన స్థానికులు

కరకగూడెం: మండలంలోని వట్టంవారిగుంపు గ్రామానికి చెందిన ఓర్సు మల్లయ్య మతిస్థిమితం కోల్పోయి శుక్రవారం మండల కేంద్రంలోని డ్రెయినేజీలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. అటువైపుగా వెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌ గమనించి స్థానికులతో కలిసి వృద్ధుడిని బయటకు తీశారు. అనంతరం నూతన వస్త్రా లు అందించి ఔదార్యం చాటుకున్నారు. కార్య క్రమంలో పోలేబోయిన పాపారావు, సంపత్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): తెలంగాణ సాయుఽ ద పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ఏర్పాటు చేయాలని తెలంగాణ కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దూడల బుచ్చయ్య కోరారు. శుక్ర వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన దొడ్డి కొమర య్య జయంతి కార్యక్రమంలో కలెక్టర్‌ అంకిత్‌కు వినతిపత్రం అందజేశారు. కొత్తగూడెం, పాల్వంచలలో సుమారు 20 మంది ఒగ్గుడోలు కళాకారులకు పెన్షన్‌, ఐడీ కార్డులు ఇవ్వాలని, పాల్వంచ పట్టణంలో కమ్యూనిటీ హాల్‌ కోసం స్థలం ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో కులపెద్దలు కంచర్ల లింగయ్య, బైరి రవి, సుంకా పెద్దాపురం, దూడల కిరణ్‌ కుమార్‌, జంగిలి రాజు, పోలే సాయి పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో

యువకుడికి గాయాలు

పినపాక: మండలంలోని సీతారాంపురంలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మణుగూరుకు చెందిన ఇమ్రాన్‌ సీతారాంపురంలో చికెన్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవల గాలివానకు పడిపోయిన సర్వీసు విద్యుత్‌ తీగను సాయంత్రం సరిచేయడానికి యత్నిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై గాయపడ్డాడు. స్థానికులు యువకుడికి సీపీఆర్‌ చేసి, 108 ద్వారా మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement