రుద్రంపూర్: సింగరేణి సంస్థను కాపాడుకోవడంతో పాటు కార్మికుల, ఉద్యోగుల భద్రత, హక్కుల సాధనే ధ్యేయంగా పోరాటాలు నిర్వహిస్తామని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం (జీఎల్‌బీకేఎస్) గౌరవ అధ్యక్షుడు సాధినేని వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలోని కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన జీఎల్‌బీకేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి పరీవాహకంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నా నూతన గనుల ఏర్పాటులో పాలకుల నిర్లక్ష్యం సింగరేణికి నష్టం కలిగిస్తోందని తెలిపారు. ఇదే సమయాన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కార్మిక సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చే లా ఏఐటీయూసీ చొరవ చూపాలని సూచించారు. సమావేశంలో జనరల్ సెక్రటరి జె.సీతారామయ్య, నాయకులు ఎ.వెంకన్న, ఎండీ రాసుద్దీన్, బ్రహ్మానందం, రామకృష్ణ, కాపు కృష్ణ, తోట రాయమల్లు, సంతు, సంజీవరావు, నాజర్‌పాషా, నరేశ్, ఎన్.సంజీవ్, గౌని నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఎస్పీకి చెక్కు అందజేత
మణుగూరురూరల్: మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో నూతనంగా పోలీస్ స్టేషన్ భవ నం నిర్మిస్తున్నారు. అందులో కౌన్సెలింగ్, ఫిర్యాదు పరిష్కార హాల్ నిర్మాణానికి సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.50లక్షలు మంజూరు చేయగా.. తొలి విడతలో మంజూరైన రూ.25 లక్షల చెక్కును మణుగూరు ఏరియా జీఎం దుర్గం రామచందర్ గురువారం ఎస్పీరోహిత్‌రాజుకు అందజేశా రు. ఎస్పీ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ మంజూ రు చేసిన సీఎస్‌ఆర్ నిధులతో మణుగూరు నూతన పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ హాల్ నిర్మాణం చేపడతామని, తద్వారా ఒకే వేదికపై ఫిర్యాదుల నమో దు, కౌన్సెలింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నిధులు మంజూరు చేసిన సింగరేణి సంస్థకు కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం జీఎం మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పన తమ బాధ్యత గా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏరియాడీజీఎం (పర్సనల్) ఎస్.రమేశ్, డీజీఎం (సివిల్) బి.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


