అశ్వారావుపేటరూరల్: మండలంలోని గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టును పీఓ ఈ (ప్యానెల్ ఆఫ్ ఎక్స్ పర్ట్స్) బృందం గురువారం సందర్శించింది. భారీవర్షాలు, వరదల తో రెండేళ్లక్రితం పెదవాగు ప్రా జెక్టుకు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టు సేఫ్టీ, పున:నిర్మాణానికి జలవనరుల శాఖ నిపుణులతో నివేదిక ఇవ్వాల్సిందిగా సీఫార్సు చేశారు. స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ ఐదుగురితో కూడిన పీఓఈ బృందాన్ని నియమించగా, వారిలో డ్యామ్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ అశోక్‌కుమార్ గంజు, జీయాలజీ ఎక్స్‌పర్ట్ ఎం.రాజు, రిటైర్డ్ ఎస్‌ఈ ఎన్.సంజీవ్, హైడ్రాలజీ ఎక్స్‌పర్ట్ భవానిరాంశర్మ, సీవిల్ ఎక్స్‌పర్ట్ బి.లక్ష్మణ్‌రావు ప్రాజెక్టును పరిశీలించారు. పునర్నిర్మాణం, డిజైన్, గేట్ల పెంపుతోపాటు నూతన డిజైన్‌తో నివేదిక సిద్ధం చేయనున్నట్లు స్థానిక డీఈఈ కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఏపీలోని ఏలూరు జిల్లా నీటిపారుదలశాఖ అధికారులతో పాటు, సీఈ శ్రీనివాసరెడ్డి, డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్ ముదల్కర్ విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో కిరణ్ తన సమీప అభ్యర్థి లక్కినేని సత్యనారాయణపై 30 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జనరల్ సెక్రటరీగా జి.మహేశ్, ఉపాధ్యక్షులుగా కె.సంజీవరావు, పర్వీన్, జాయింట్ సెక్రటరీగా నాగరాజు, ట్రెజరర్‌గా సంధ్యారాణి, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీగా బానోత్ దేవదాస్, ఉమ, లైబ్రరీ సెక్రటరీగా దొడ్డా ప్రసాద్ గెలుపొందారు.


