పాల్వంచరూరల్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పరిధి సేల్స్ డిపోల్లో లక్ష్యాలను అధిగమించే లా ఉద్యోగులు కృషి చేయాలని జీసీసీ డీఎం సమ్మయ్య సూచించా రు. పాల్వంచలోని గిరిజన సహకార సంస్థ బ్రాంచ్ కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయనపాల్గొన్నారు. బ్రాంచ్ పరిధి ఉప్పు సాక, యానంబైల్, మైలా రం, పూసుగూడెం, తిమ్మంపేట, ఇరవెండి సేల్స్ డిపోల మరమ్మతులు చేయాలని సేల్స్‌మెన్లు కోరగా ఐటీడీఏ పీఓకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. అలా గే, అటవీ ఫలసాయం సేకరిస్తున్న ఆదివాసీ, గిరిజనులను ఫారెస్ట్ అధికారు లు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆ తర్వాత పాల్వంచ బ్రాంచ్ వద్ద ఖాళీస్థలంలో పెట్రోల్‌బంక్ ఏర్పా టు, గిరిజనులను అడ్డుకునే అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. బ్రాంచ్ మేనేజర్ లక్ష్మణ్, ఉద్యోగులు జార్జ్‌పాల్, శివ, రాము, డైరెక్టర్లు వెంకటమ్మ, లక్ష్మి, వి.నాగేశ్వరరావు, రమేశ్ పాల్గొన్నారు.
సైబర్ మోసంపై యూపీ పోలీసుల విచారణ
ఇల్లెందు: ఇల్లెందులో సైబర్‌మోసం వెలుగుచూసింది. స్థానికుడైన పూర్ణాచారిని సంప్రదించిన సైబర్‌మోసగాళ్లు బ్యాంకుల్లో అకౌంట్లు తీయించారు. అకౌంట్లలో జమఅయ్యే డబ్బు డ్రా చేసి ఇస్తే కమీషన్ ఇస్తామని వారు నమ్మించారు. ఆపై ఏటీఎం కార్డులు తీసుకుని ఆయనఖాతాల్లో జమఅవుతున్న నగదు డ్రా చేసుకుంటున్నారు. ఈ క్రమాన పూర్ణాచారి అకౌంట్‌లో వివిధ ప్రాంతాల నుంచి నగదు జమకావడంతో పోలీసులకు బ్యాంకు అధికారులు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఉత్తరప్రదేశ్‌లోనూ కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులు గురువారం ఇల్లెందుకు చేరుకుని పూర్ణాచారి నుంచి నగదు రికవరీ చేశారు.


