అలసత్వం వీడిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

అలసత్వం వీడిన అధికారులు

Mar 27 2026 8:50 AM | Updated on Mar 27 2026 8:50 AM

భద్రాచలంటౌన్‌: శ్రీ సీతారామచంద్ర స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘అసంపూర్తిగానే రామయ్య పెళ్లి పనులు’ కథనం జిల్లా యంత్రాంగంలో చలనం తెచ్చింది. నామమాత్రంగా సాగుతున్న పనులపై భక్తుల ఆగ్రహాన్ని, క్షేత్రస్థాయి పరిస్థితులను కథనంలో పేర్కొనగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు గురువారం రాత్రి వేళ కూడా పనులు చేపట్టారు. చర్ల రోడ్డులో డివైడర్లకు రంగులు వేయడం, లైటింగ్‌ ఏర్పాటు వంటి పనులు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement