కలెక్టరేట్ ఎదుట ధర్నాలో టీపీటీఎఫ్ నాయకులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి 20శాతం నిధులు కేటాయించాలని (తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్) టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుటారి రాజు డిమాండ్ చేశారు. అలాగే, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో మంగళవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుగులోత్ హరిలాల్‌నాయక్, జోగా రాంబాబుతో కలిసి ఆయన మాట్లాడారు. అధికార పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా విద్యా కమిషన్ నివేదికకు అనుగుణంగా విద్యారంగానికి నిధులు కేటాయించి బలోపేతం చేయాలని కోరారు. అలాగే, పీఆర్సీ ఫిట్‌మెంట్, రిటైర్డ్ టీచర్లకు ప్రయోజనాల చెల్లింపు, సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకాక కాంట్రాక్ట్ ఉపాధ్యా య వ్యవస్థను రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలని, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, గిరిజన ఆశ్రమ పాఠశా లల్లో ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య సదు పాయాన్ని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు ఎం.రామాచారి, కె.మాధవరెడ్డి, బి.ప్రసాద్‌రావు, పి.గంగరాజు, వి.సరియా, పి.కృష్ణయ్య, జి.భాగ్య రావు, ఎస్.కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
అశ్వారావుపేటరూరల్: పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ యయా తీ రాజు కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన దారా శ్రీనివాసరావు (54) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నా డు. ఈ నెల 16వ తేదీన జీవితంపై విరక్తి చెందిన ఇంట్లో ఉన్న కలుపుమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు హైదారాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య సత్యవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కారేపల్లిలో కల్తీ మద్యం కలకలం?
కారేపల్లి: కారేపల్లిలో నకిలీ మద్యం అమ్ముతున్నారనే సమాచారం కలకలం రేపింది. బెల్టు దుకాణాల్లో మద్యం సీసాల మూతలు తెరిచి, ఆపై కల్తీ చేసి విక్రయిస్తున్నారనే ప్రచారంతో సోమ, మంగళవారం ఎకై ్సజ్ సీఐ స్రవంతి, ఎస్‌ఐ వసంతలక్ష్మి ఆధ్వర్యాన సిబ్బంది తనిఖీలు చేపట్టారు. లావుడ్యాతండా, భాగ్యనగర్ తండాల్లోని బెల్ట్ షాపుల్లో మూతలు తెరిచి ఉన్న 114 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కారేపల్లిలోని ఒకే వైన్స్ నుంచి బెల్టు షాపులకు మద్యం సరఫరా అయిందనే అనుమానంతో విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై సీఐ స్రవంతిని వివరణ కోరగా.. బెల్టు షాపుల్లో మద్యం సీసాలమూతలు వదులుగా ఉండడంతో స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
ట్రెంచ్ పనులను అడ్డుకున్న గిరిజనులు
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలో పోడు వివాదంమళ్లీ రాజు కుంది. కాకర్లపల్లి బీట్‌లోని 157, 158 ఫారెస్ట్ కంపార్ట్‌మెంట్లలో 25ఎకరాల అటవీభూమికి పట్టాలు ఇవ్వాలని సత్తుపల్లి ఒకటో వార్డుకు చెందిన నాయకపోడు గిరిజనులు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. 2022లో అప్పటి ప్రభుత్వం 75 ఎకరాలకు పట్టాలు ఇచ్చినా, మిగతా వారికి కూడా ఇవ్వాలని కోరుతున్నారు. కానీ అటవీశాఖ అధికారులు 25 ఎకరాల్లో జామాయిల్ ప్లాంటేషన్ వేయాలని ట్రెంచ్ కొట్టిస్తున్నారు. అక్కడ మంగళవారం కూడా ఎఫ్‌ఆర్‌ఓ స్నేహలత ఆధ్వర్యాన పనులు చేపడుతుండగా గుడిపాడు కాలనీకి చెందిన పూచి వరలక్ష్మి, రాజిని దుర్గ ఆధ్వర్యాన నాయకపోడు మహిళలు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. సీఐ టి. శ్రీహరి సిబ్బందితో చేరుకుని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్‌తో మాట్లాడే వరకు సంయమనం పాటించాలని సూచించడంతో ఆందోళన విరమించారు.


