కొణిజర్ల: విధుల నిమిత్తం ద్విచక్రవాహనంపై కార్యాలయానికి వెళ్తున్న ‘సాక్షి’దినపత్రిక ఉద్యోగి ప్రతా పురం శ్రీనివాస్‌ను లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన మంగళవారం సాయంత్రం బైక్‌పై వస్తూ కార్యాలయంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఖమ్మం వైపు నుంచి వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఉద్యోగులు, స్థానికులు ఆయనకు తనికెళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, లారీ పశ్చిమబెంగాల్ నుంచి వైజాగ్ వెళ్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కొణిజర్ల పోలీసులు చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


