మణుగూరురూరల్: మండలానికి చెందిన ఓ యువకుడు రైలులో నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మణుగూరుకు చెందిన యశ్వంత్ ఒక కేసు విషయమై మహబూబాబాద్ జిల్లా మానుకోట కోర్టుకు వెళ్లి వాయిదా తర్వాత మణుగూరుకు తిరిగి వస్తున్నా డు. తీవ్ర మనస్తాపానికి గురైన యశ్వంత్ రైలులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యశ్వంత్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా యశ్వంత్ ఆత్మహత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


