ఆటో బోల్తా.. డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. డ్రైవర్‌ మృతి

Mar 23 2026 8:29 AM | Updated on Mar 23 2026 8:29 AM

దుమ్ముగూడెం: మండలంలోనితూరుబాక గ్రామశివారులో ఆటోబోల్తాపడిన ఘటనలో పాల్వంచకు చెందిన తురక వెంకటనరసింహారావు(50) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నా యి. వెంకటనరసింహారావు భార్యతో కలిసి నడికుడి ఆల యం దగ్గర జరిగిన ఓ శుభా కార్యానికి ఆటోలో వెళ్లి తిరిగి పాల్వంచకు వస్తున్నాడు. ఈ క్రమంలో తూరుబాక గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడింది. దీంతో తీవ్రగాయాలైన ఆయనను 108లో భద్రాచలం తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటన స్థలాన్ని ఎస్‌ఐ పోటు గణేష్‌ సందర్శించి కేసు నమోదు చేశారు.

క్షతగాత్రుడిని పరిశీలించిన ఎమ్మెల్యే..

తూరుబాక గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తురక వెంకటనరసింహారావు పరిస్థితిని ఘటన స్థలంలో ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావు పరిశీలించారు. బండిరేవు నుంచి భద్రాచలం వెళ్తున్న ఎమ్మెల్యే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో వెంటనే కారు దిగిన ఎమ్మెల్యే క్షతగాత్రుడిని నాడిని పరీక్షించాక 108లో తరలిస్తున్నగా మృతి చెందాడు.

విద్యుత్‌ వైర్లు యమపాశమై..

మణుగూరుటౌన్‌: అడవిలో వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్‌ వైర్లు ఓ వ్యక్తి పాలిట శాపమైంది. ఆ వైర్లు తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పగిడేరులో ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలను స్థానికులు ఇలా తెలిపారు. పగిడేరు గ్రామానికి చెందిన కుంజా సుమన్‌(40) మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్తున్నాడు. ఈక్రమంలో ఖమ్మం తోగుబుగ్గ–పగిడేరులో ఇతర వ్యక్తులు ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆ ఉచ్చు పెట్టిన వారు పెద్దిపల్లి గ్రామస్తులుగా బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రావణ్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో నాలుగు పూరిళ్లు దగ్ధం

కొత్తవారిగూడెం రెండు ఇళ్లు దగ్ధం

అశ్వారావుపేటరూరల్‌: మండల పరిధిలోని కొత్త నారంవారిగూడేనికి చెందిన అన్నదమ్ములైన కిన్నెర శ్రీను, అర్జున్‌లకు చెందిన పూరిళ్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ముందుగా అర్జున్‌ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటల చెలరేగగా.. ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదుతో పాటు గృహోపకరణలన్నీ దగ్ధమయ్యాయి. అలాగే పక్కనే ఉన్న శ్రీను ఇంట్లో తన కుమార్తె పెళ్లి కోసం బీరువాలో ఉంచిన రూ.2.50లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు వస్తువులన్నీ కాలిపోయాయి. మొత్తంగా సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని సంఘటన స్థలానికి వచ్చిన ఫైర్‌ ఆఫీసర్‌ సైదులు, తహసీ ల్దార్‌ సీహెచ్‌వీ రామకృష్ణలకు బాధితులు తెలిపారు.

రామచంద్రాపురంలో మరో రెండు ఇళ్లు..

దుమ్ముగూడెం: మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన కల్లూరి వెంకటమ్మకు చెందిన ఇంటిలో ఆదివారం షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. ఆతర్వాత పక్కనే ఉన్నా బుచ్చమ్మ ఇంటికి వ్యాపించడంతో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఇంట్లోని వస్తువులతో పాటు నగదు, పట్టా పుస్తకాలు, తదితరాలు కాలిపోయి సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. ఈక్రమాన స్థానిక సర్పంచ్‌ తుర్రం నవీన్‌ సందర్శించి అండగా ఉంటామన్నారు.

పోక్సో కేసు నమోదు

అశ్వారావుపేటరూరల్‌: ప్రేమ పేరుతో ఓ మైనర్‌ను వేధించిన యువకుడిపై ఆదివారం రాత్రి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ యయాతీరాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేట పట్టణానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతుంది. ఈక్రమంలో అశ్వారావుపేటకు చెందిన 23 ఏళ్ల ఆరేపల్లి వెంకన్న కొద్దిరోజులుగా ప్రేమపేరుతో వెంటపడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాలిక తండ్రికి చెప్పడంతో తండ్రి ఫిర్యాదు మేరకు వెంకన్నపై పోక్సో కేసునమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement