ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటు చేయాలి

Mar 23 2026 8:29 AM | Updated on Mar 23 2026 8:29 AM

అశ్వారావుపేటరూరల్‌: స్థానికంగా ఉన్న పామాయిల్‌ ఫ్యాక్టరీలను దృష్టిలో పెట్టుకొని అశ్వారావుపేటలో ఆయిల్‌ రిఫైనరీ యూనిట్‌తోపాటు అదనపు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టాలని తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ అశ్వారావుపేట జోన్‌ ఆయిల్‌పాం గ్రోవర్స్‌ సొసైటీ బాధ్యులు కోరారు. ఆదివారం మండలంలోని నారంవారిగూడెం వద్ద గల ఆయిల్‌ఫెడ్‌ డివిజ నల్‌ కార్యాలయం ఎదుట సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. స్థానికంగా రెండు ఫ్యాక్టరీలతో పాటు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీతో పాటు భవిష్యత్‌లో మరిన్ని ఫ్యాక్టరీలు నిర్మించాల్సి ఉందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఆయిల్‌ రిఫైనరీ యూనిట్‌ నిర్మించడం ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన, ఆయిల్‌ఫెడ్‌కు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. పామాయిల్‌ గెలల ఉత్పత్తికి తగినట్లుగా అశ్వారావుపేటలో 60 టన్నుల సామర్థ్యంతో మరో ఫ్యాక్టరీ నిర్మించాలన్నారు. రైతులు తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, కారం శ్రీరాములు, చెలికాని సూరిబాబు, తలశిల ప్రసాద్‌, నున్న కృష్ణ, మోరంపూడి శ్రీనివాస్‌, గడ్డం సత్యనారాయణ, మడివి దుర్గారావు, చెన్నారావు, యండ్రాతి అప్పారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement