బూర్గంపాడు: మండల కేంద్రం బూర్గంపాడుకు చెందిన సామాజిక కార్యకర్త గొనెల నానికి రాష్ట్రస్థాయి స్వర్ణ నంది ఉగాది పురస్కారం దక్కింది. మొగిలి అండ్ ఎన్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో నానికి పురస్కారం లభించింది. 27 సార్లు రక్తదానం చేయడం, గోదావరి వరదల సమయాన బాధితులను రక్షించడం, కరోనా కష్టకాలంలో అన్నదానం, అనాఽథశవాలకు అంత్యక్రియలు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలకు పురస్కారం లభించింది. ఈ పురస్కారం అందజేసిన వారిలో నిర్వాహక ప్రతినిధులు డాక్టర్ పాలకుర్తి కృష్ణ, మొగిలి గుణాకర్, నాగసాయి పాల్గొన్నారు.
అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన కోలాటం శిక్షకుడు, కవి, గాయకుడు, ఐటీసీ ఉద్యోగి తోకల రమేష్‌కు స్వర్ణ నంది ఉగాది పురస్కారం అందజేశారు. తన రచనలతో పాటు, ఐటీసీ ఉద్యోగిగా సామాజిక సేవలు అందిస్తున్నందుకు గాను అవార్డుకు ఎంపిక కాగా దర్శకుడు, రచయిత, నటుడు కాంతేశ్వరరావు, సినీ రచయిత కోమాకుల సీతారాములు, ఉత్తమ కవిరత్న తోటమళ్ల సురేష్‌బాబులు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.


