నాలుగు తరాల వారు ఒక్కచోట..
అశ్వాపురం: నాలుగుతరాల కుటుంబ సభ్యులు పుట్టిన ఊరులో ఒక్కచోటకు చేరి సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. మండలంలోని అమ్మగారిపల్లి గ్రామానికి చెందిన గాదె కేశవరెడ్డి సోదరులు, సోదరీమణులు వారి కుటుంబ సభ్యులు అందరూ ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తమ పుట్టిన ఊరైన అమ్మగారిపల్లి గ్రామంలోని వారి పూర్వీకుల నివాసానికి వచ్చి సంక్రాంతి వేడుకలు మూడు రోజుల పాటు జరుపుకున్నారు. వేడుకల్లో శుక్రవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కేశవరెడ్డి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.


