తెలుగు రాష్ట్రాల హవా...
పినపాక: జాతీయస్థాయి అండర్–17 కబడ్డీ పోటీలు మూడో రోజు శుక్రవారం కూడా రసవత్తరంగా కొనసాగాయి. బిహార్‌పై తెలంగాణ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి 23 పాయింట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. మణిపూర్ జట్టుపై 20 పాయింట్ల తేడాతోఆంధ్రప్రదేశ్ ఘన విజయం సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. తెలంగాణ జట్టు విజయంలో కెప్టెన్ దేవరాజ్, జిల్లాలోని ములకలపల్లి మండలానికి చెందిన సాయి కీలక పాత్ర పోషించారు. రెండు రాష్ట్రాల జట్లు పోటీలో ఉండటంతో అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని క్రీడలను వీక్షించారు.
ముగిసిన లీగ్
జాతీయస్థాయి అండర్–17 కబడ్డీ పోటీల్లో శుక్రవారం లీగ్ దశ ముగిసింది. విద్యాభారతి, పంజాబ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి, గుజరాత్, రాజస్థాన్, మణిపూర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, హరియాణా, తమిళనాడు, మహారాష్ట్ర, సీబీఎస్‌ఈ జట్లు ప్రీ క్వార్టర్ పోటీలకు అర్హత సాధించాయి. మిగిలిన 16 జట్లు టోర్నీ నుంచి నిష్ట్రమించినట్లు అధికారులు తెలిపారు. శనివారం ప్రీ క్వార్టర్, క్వార్టర్, ఆదివారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో
తెలంగాణ, ఏపీ విజయం


