లూయీస్ బ్రెయిలీకి నివాళి
సూపర్‌బజార్(కొత్తగూడెం): లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలను జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తుకారం రాథోడ్, జిల్లా సంక్షేమ శాఖాధికారి జేఎం స్వర్ణలత లెనీనా హాజరయ్యారు. మొదట బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణలత లెనీ నా మాట్లాడుతూ బ్రెయిలీ కనిపెట్టిన చుక్కల లిపి ద్వారా అంధుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని అన్నారు. బ్రెయిలీ లిపి ద్వారా అంధులు విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించారని అన్నారు. అంధులైన ఉద్యోగులను, అంధుల కోసం వివిధ రంగాల్లో సేవ చేస్తున్నవారిని సన్మానించి గోడ గడియారాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో బ్లైండ్ అసోసియేషన్ సభ్యులు ఎం.నరేందర్, రాజ్ కిరణ్, రమణయ్య, ఉపేంద్రమ్మ, అనూష, కిరణ్, వరప్రసాద్, నాగేశ్వరరావు, నరేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


