సింగరేణి టోర్నమెంట్ ప్రారంభం
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియాలోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్‌లో శుక్రవారం ఇంటర్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేంరాజు ప్రారంభించారు. జెండా ఆవిష్కరించి, ఇతర విభాగాల అధికారులతో కలిసి బెలూన్లను వదిలారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో తలమునకలయ్యే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని అన్నారు. పోటీల్లో బెల్లంపల్లి, రామగుండం, కొత్తగూడెం రీజియన్ల అధికారులు పాల్గొంటారని తెలిపా రు. కాగా మొదటి రోజు కొత్తగూడెం, కార్పొరేట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.


