వీబీ–జీ రామ్‌జీ బిల్లు చరిత్రాత్మకం
చుంచుపల్లి: కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చిన వికసిత్ భారత్ రోజ్ గార్ ఔర్ ఆజివిక మిషన్ గ్రామీణ్ (వీబీ–జీ రామ్‌జీ)–2025 చట్టం చరిత్రాత్మకమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కార్యలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్ ఈజీఎస్ పథకం పేరు మార్చడంపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. గతంలో వంద రోజులు ఉన్న పని దినాలను 125 రోజులకు పెంచుతూ ఈ చట్టం రూపకల్పన చేశారని తెలిపారు. సమావేశంలో గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి భూక్య రవినాయక్, నాయకులు బలగం శ్రీధర్, మాలోతు గాంధీ, సాయి శ్రీనివాస్, గొడుగు శ్రీధర్, జల్లారపు శ్రీనివాస్, గుంపుల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


