రాష్ట్రస్థాయి క్రీడల్లో సత్తా
పాల్వంచరూరల్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలల విద్యార్థులు రెండేళ్లుగా రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ చూపి చాంపియన్‌షిప్‌లను కై వసం చేసుకుంటున్నారు. ఇటీవల ఏటురూనాగారంలో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడాపోటీల్లోనూ ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నారు. అథ్లెటిక్స్ బాలికలు అండర్–14, 17 విభాగాల్లో, బాలురు అండర్–17 విభాగంలో 40 మీటర్లులో బంగారు పతకం, 30 మీటర్ల పరుగులో వెండి పతకాలు సాధించారు. బాలికలు అండర్–17 విభాగంలో 40 మీటర్ల పరుగులో బంగారు, 30 మీటర్ల పరుగులో సిల్వర్, వాలీబాల్ పోటీల్లో బాలురు అండర్–17 విభాగంలో బంగారు, అండర్–14 విభాగంలో సిల్వర్ మెడళ్లు సాధించారు. కబడ్డీలో బాలురు, బాలికలు అండర్–17 విభాగంలో బంగారు, అండర్–14 విభాగంలో బాలికలు బంగారు, ఖో–ఖోలో అండర్–17 విభాగంలో కాంస్యం, టెన్నీకాయిట్‌లో బాలురు అండర్–17 విభాగంలో కాంస్యం, చదరంగంలో అండర్–14 విభాగంలో బాలురు, బాలికలు బంగారు పతకాలు సాధించి.. సీనియర్, జూనియర్ బాలురు, బాలికలు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నట్లు ఐటీడీఏ క్రీడల అధికారి బొల్లి గోపాల్‌రావు తెలిపారు. కాగా, శుక్రవారం విజేతలకు ఏటూరూనాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, డిప్యూటీ డైరెక్టర్ జనార్దన్ ట్రోఫీ అందించారు.
ఓవరాల్ చాంపియన్ కై వసం


