వనమా రాఘవ వల్ల ప్రాణహాని
బీఆర్‌ఎస్ నాయకుడు చందునాయక్
సెల్ఫీ వీడియో వైరల్
పాల్వంచ: బీఆర్‌ఎస్ కోసం కష్టపడి పనిచేసే తనను అవమాన పర్చే విధంగా మాట్లాడిన వనమా రాఘవేందర్‌రావు వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆ పార్టీ నాయకుడు చందునాయక్ ఆరోపించారు. శుక్రవారం వనమా రాఘవపై చందునాయక్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కార్పొరేషన్ ఎన్నికల కోసం మాట్లాడాలని వనమా రాఘవ తన ఇంటికి పిలిపించాడని, తాను గతంలో జలగం వెంకట్రావ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వద్ద పనిచేశావని, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్ ఎలా వస్తుందని ప్రశ్నించాని తెలిపారు. ‘నేను’పార్టీలో లేకపోయినా కేసీఆర్, కేటీఆర్ ఇంటికి భోజనానికి వస్తారని, నేను చెప్పిందే శాషనం అని కులం పేరుతో రాఘవ దూషించాడని, తన సంగతి చూస్తానని బెదిరించాడని చందునాయక్ వాపోయాడు.
రైతులకు సరిపడా యూరియా
కూసుమంచి: యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయశాఖ సంచాలకులు డాక్టర్ గోపి తెలిపారు. మండలంలోని చేగొమ్మ పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల సాగు, యూరియా అవసరంపై రైతులతో మాట్లాడారు. యూరియా నిల్వలు, డిమాండ్, సాగు ఆధారంగా నియోజకవర్గంలోని సబ్‌సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తుండడంతో ఇబ్బంది రాలేదని అధికారులు తెలిపారు. ఈ విధా నం బాగుందని అభినందించిన సంచాలకులు, అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్, ఏడీఏ సతీష్, ఏఓ వాణి, సీఈఓ రామకృష్ణ పాల్గొన్నారు.


