సత్యంపేటలో ‘ప్రజాబాట’
ములకలపల్లి: మండలపరిఽధిలోని సత్యంపేట గ్రామంలో గురువారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజాబాట’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్‌ఈ జి.మహేందర్ మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగం, కరెంట్ వాడకంపై పొ దుపు తదితర అంశాలపై వివరించారు. మా ధారం సర్పంచ్ గంపా సుజాత, ఏడీఈ రహీం హుస్సేన్, ఏఈ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.
కలకోటలో
చేపల చోరీకి యత్నం
బోనకల్: మండలంలోని కలకోట చెరువులో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియ ని వ్యక్తులు చేపల చోరీకి యత్నించారు. అదే సమయానికి మత్స్య సహకార సంఘం సభ్యులు వచ్చేసరికి వారు పారిపోయారు. అప్పటికే పెద్దమొత్తంలో చేపలు పట్టి తరలించేందుకు సిద్ధం కాగా, వాటితో పాటు వలలను వదిలేసి వెనుదిరిగారు. ఘటనపై సంఘం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.వెంకన్న తెలిపారు.
సత్యంపేటలో ‘ప్రజాబాట’


