రేషన్‌ షాపుల్లో టాస్క్‌ఫోర్స్‌ సోదాలు | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ షాపుల్లో టాస్క్‌ఫోర్స్‌ సోదాలు

Jan 7 2026 7:32 AM | Updated on Jan 7 2026 7:32 AM

రేషన్‌ షాపుల్లో  టాస్క్‌ఫోర్స్‌ సోదాలు

రేషన్‌ షాపుల్లో టాస్క్‌ఫోర్స్‌ సోదాలు

ఇల్లెందు: పట్టణంలోని పలు రేషన్‌ షాపులపై స్టేట్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగం అధి కారులు సోదాలుచేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు టీం అధికారి అంజయ్య ఆధ్వర్యంలో రెండు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. మొ ద ట నంబర్‌–2 బస్తీలోని ఓ మాజీ కౌన్సిలర్‌కు చెందిన రేషన్‌ షాపును తనిఖీ చేశారు. ఆ పక్కనే గల మరో షాపులోకి వెళ్లగా అప్పటికే సమాచారం అందుకున్న ఆ షాప్‌ యజమాని అదృశ్యం అయ్యారు. ఆ తర్వాత కొత్త కాలనీలోని 41వ నెంబర్‌ షాపులను తనిఖీ చేశారు. ఈ సోదాలతో డీలర్లలో ఆందోళన మొదలైంది. నెల రోజుల క్రితం ఇక్కడి సివిల్‌ డీటీని టేకులపల్లిలో ఓ డీలర్‌ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.

దాడి ఘటనలో ఇద్దరిపై కేసు

ఇల్లెందురూరల్‌: మండలంలోని భద్రుతండా గ్రామానికి చెందిన వాంకుడోత్‌ శ్రీను, అతని కుమారుడు వంశీ తనపై దాడి చేశారంటూ అదే గ్రామానికి చెందిన వాంకుడోత్‌ భీమా మంగళవారం ఫిర్యాదు చేశాడని ఎస్‌ఐ నాగుల్‌మీరా చెప్పారు. ఈ మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement