రామదాసు మండపంలో రాపత్తు సేవ
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో రాపత్తు సేవలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయ నిర్మాణ కర్త భక్త రామదాసుకు గుర్తుగా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో సేవ జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణలు, కోలాటాల నడుమ తహసీల్దార్ క్వార్టర్ వద్దనున్న రామదాసు మండపం వరకు తీసుకొచ్చారు. స్వామి వారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తుల దర్శనార్థం హారతి సమర్పించి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు, ఇతర రెవెన్యూ సిబ్బంది, అర్చకులు, వేదపండితులు , భక్తులు పాల్గొన్నారు.
ముత్తంగి అలంకరణలో మూలమూర్తులు
అంతరాలయంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చా రు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడు మ గర్భగుడినుంచి ఊరేగింపుగా తీసుకొవచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోకంగా జరిపారు. కాగా ఈఓ దామోదర్‌రావు ఆలయ ప్రాంగణంలో ఉన్న వస్త్రాల కౌంటర్, ప్రచారశాఖ కౌంటర్లను తని ఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, అధి క ధరలకు విక్రయాలను జరపొద్దని హెచ్చరించారు.
రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పూజలు


