సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
పాల్వంచ: ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. టీఎన్‌జీవో, టీజీవో, ట్రస్మా ఆధ్వర్యంలో ఆదివారం సుగుణ గార్డెన్‌లో ప్రగతి టు గెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పంచాయతీ రాజ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు సాధించిన ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. మునగ, అజొల్లా, సమీకృత వ్యవసాయం, కొర్రమీను, కౌజుపిట్టల పెంపకం, బయోచార్, ఇటుకల తయారీ వంటి వాటిల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డీవో మధు, జిల్లా పరిషత్ సీఈవో విజయలక్ష్మి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


