బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు
కామేపల్లి : మతతత్వ రాజకీయాలతో దేశ ప్రజలను విభజిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్మించి, లౌకిక, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మండలంలోని జాస్తిపల్లిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనిజులాపై అమెరికా చేపడుతున్న యుద్ధోన్మాద చర్యలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల ఆధారంగా ఉద్యమాలు నిర్మించి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంటింటికీ సీపీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు దుగ్గి కృష్ణ, భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, మెరుగు సత్యనారాయణ, రమణ, తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు, సుంకర సుధాకర్, దొంతిబోయిన నాగేశ్వరావు, చింతనిప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు, అంబటి శ్రీనివాసరెడ్డి, మచ్చా మణి, కంచర్ల అనిత తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


