నాటుసారాపై ఉక్కుపాదం మోపుతాం
కరకగూడెం: నాటుసారా నియంత్రణలో భాగంగా మణుగూరు ఎకై ్సజ్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండలంలోని కలవలనాగారం శివారులోని అటవీ ప్రాంతంలో 1000 కిలోల బెల్లం, 15 కిలోల పటిక, 6 లీటర్ల నాటుసారాతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు బాధ్యులైన భూక్యా రామదాసు, ఇస్లావత్ బన్సీలాల్, వాంకుడోత్ బాబూరావు, కుంసోత్ సాగర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ రాజిరెడ్డి వెల్లడించారు. దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది వెంకట అప్పారావు, ప్రసన్న, సతీశ్ పాల్గొన్నారు.


