డీప్ సైడ్ ను సింగరేణికే కేటాయించాలి
మణుగూరు టౌన్: మణుగూరు భవిష్యత్‌తో ముడి పడి ఉన్న సింగరేణి పీకేఓసీ–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హైదరాబాద్‌లోని అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గని సింగరేణికి వస్తే మణుగూరు ఏరియాకు మరో 20 సంవత్సరాల భవిష్యత్ పెరుగుతుందని అన్నారు. ప్రస్తుతం నడుస్తున్న మైన్ జీవితకాలం 2031తో ముగియనుందని, డీప్ సైడ్ సింగరేణికి కేటాయించకపోతే వేలాది మంది కాంట్రాక్ట్, ఓబీ కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. కోల్ ట్రాన్స్‌పోర్ట్ రంగం దివాళా తీస్తుందని చెప్పారు. స్పందించిన డిప్యూటీ సీఎం తగిన చర్యలు చేపడతానని హామీనిచ్చారని ఎమ్మెల్యే పాయం తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే పాయం


