క్రీడాకారుల సాధన
● బయ్యారం చేరిన తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు ● స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ
పినపాక: జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలు ఈ నెల 7 నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు. 16 మంది సభ్యులతో కూడిన తెలంగాణ రాష్ట్ర జట్టు ఈ నెల 1న ఈ.బయ్యారం చేరింది. క్రీడాకారులు వారం రోజులు ముందుగానే సాధన ప్రారంభించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధికారుల ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో కోర్టుకు సంబంధించిన మ్యాట్లు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. చలి, మంచు కారణంగా సాధనకు ఇబ్బందులు లేకుండా రాత్రి పగలు శిక్షణ ఇవ్వటానికి రైతు వేదికలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


