ఆయిల్‌ఫెడ్‌లో బదిలీలు.. బాధ్యతల స్వీకరణ
అశ్వారావుపేటరూరల్: ఆయిల్‌ఫెడ్‌లో పలువురు అధికారులకు బదిలీ కాగా, మరికొందరు అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం ఏరియా ఆఫీసర్‌గా పని చేస్తున్న శంకర్‌ను మండలంలోని నారంవారిగూడెం ఆయిల్‌ఫెడ్ నర్సరీ డివిజనల్ మేనేజర్‌గా నియమించారు. దీంతో ఆయన శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఇన్‌చార్జి రాధాకృష్ణ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో కొంతకాలంగా మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.నాగబాబును దమ్మపేటలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో అప్పారావుపేట ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఎంఎన్ కార్తీక్‌కు ఇన్‌చార్జి మేనేజర్ బాధ్యతలు అప్పగించారు. అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న కల్యాణ్ గౌడ్‌ను ఆయిల్‌ఫెడ్ రాష్ట్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా బదిలీ, కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులను తోటి ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.


