● ‘నయా’ జోష్ !
పాల్వంచ కేటీపీఎస్ సీఈ ప్రభాకర్‌రావుకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఇంజనీర్లు
జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కేక్‌లు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఇళ్ల లోగిళ్లలో సుందరమైన ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, పాల్వంచ పెద్దమ్మతల్లి, అన్నపురెడ్డిపల్లి శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి, కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ తదితర ఆలయాలతో పాటు పలు చర్చిలకు భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరంలో తమ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలంటూ ఇష్టదైవాలను వేడుకున్నారు. సింగరేణి, కేటీపీఎస్, బీటీపీఎస్, ఐటీసీ తదితర సంస్థల్లో సంబరాలు అంబరాన్నంటగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
– నెట్‌వర్క్


