సింగరేణిలో ‘నూతన’ వేడుకలు
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాలని చెప్పారు. 2025లో అతి తక్కువ గని ప్రమాదాలు జరిగాయని అన్నారు. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తితోపాటు రక్షణ సూత్రాలు పాటిస్తూ ప్రమాదరహిత సింగరేణిగా అవతరించాలని ఆకాంక్షించారు. గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) బ్రాంచ్ సెక్రటరీ ఎస్.వి.రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం (ఐఎన్‌టియూసి) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి.త్యాగరాజన్‌ు, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ టి.లక్ష్మీపతిగౌడ్, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.


