రేసులో ఉంటుందా?!
తుది నిర్ణయం
మంత్రి తుమ్మల చేతిలో...
అంతా అనుకూలిస్తే కౌన్సిల్ రద్దుపై తీర్మానానికి యోచన
తీర్మానానికి కావాల్సిన సంఖ్యాబలంపై లెక్కలు
రద్దు చేయాలంటే..
మిగతా మున్సిపాలిటీలతో కలవాలని..
రాష్ట్రంలో ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఓటర్ల జాబితా తయారీపై ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా 10వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మధిర, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. వీటితో పాటే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై మంత్రి తుమ్మల సూచనలతో మేయర్, ఆ పార్టీ కార్పొరేటర్లు సమావేశం కాగా మెజార్టీ సభ్యులు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని మున్సిపాలిటీలతో కలిపి కేఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే మెజార్టీ డివిజన్లు కాంగ్రెస్ కై వసం చేసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మంత్రికి చేరిన సమాచారం
పార్టీలోని మెజార్టీ కార్పొరేటర్లు ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపిన అంశాన్ని మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడాక స్పష్టత వస్తుందని పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు పార్టీలో చేరారు. ఈ బలానికి తోడు ప్రభుత్వం అధికారంలో ఉండడం.. ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులతో కార్పొరేషన్‌ను కై వసం చేసుకోవచ్చనే ఆలోచనలో మంత్రి ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది మే 7వ తేదీ వరకు పాలకవర్గానికి గడువు ఉన్నా మిగతా మున్సిపాలిటీలతో కలిపి ఎన్నికలకు వెళ్తే పార్టీపరంగా కలిసివస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైనందున మంత్రి నిర్ణయం కీలకం కానుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
బలాబలాలు మారినా తక్కువే..
గత ఎన్నికల్లో 60 డివిజన్లకు గాను బీఆర్‌ఎస్ 45, కాంగ్రెస్ 10, సీపీఎం, సీపీఐ రెండేసి డివిజన్లతో పాటు ఒక డివిజన్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. తద్వారా మేయర్ పీఠాన్ని బీఆర్‌ఎస్ కై వసం చేసుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బలాబలాలు మారాయి. మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీకి 31 మంది, బీఆర్‌ఎస్‌కు 26 మంది, సీపీఎంకు ఇద్దరు, సీపీఐకి ఒక కార్పొరేటర్ ఉన్నారు. కౌన్సిల్ రద్దు చేయాలన్న నిర్ణయానికి కాంగ్రెస్‌కు తోడు సీపీఎం, సీపీఐ సభ్యులు మద్దతు తెలిపినా 34 మందే అవుతారు. కానీ 40 మంది సభ్యుల మద్దతు అవసరం ఉండగా... ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయానికి బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కూడా మద్దతు తెలుపుతారనే చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది. ఇదంతా వారం రోజుల్లోనే పూర్తిచేయాలన్న భావనతో ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు ముందడుగు పడనుంది.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్‌లో కసరత్తు
కౌన్సిల్‌ను రద్దు చేయాలన్న తీర్మానాన్ని మెజార్టీ సభ్యులు బలపరిస్తేనే ప్రక్రియ ముందుకు సాగనుంది. మొత్తం 60 మంది కార్పొరేటర్లలో 40 మంది అంటే 2/3 సభ్యులు తీర్మానానికి అంగీకారం తెలపాలి. ఇందుకోసం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదా రాతపూర్వక తీర్మానం పై 2/3 వంతు సభ్యులు సంతకాలు చేసి కలెక్టర్‌కు ఇస్తేఅక్కడి నుంచి ప్రభుత్వానికి చేరుతుంది. ఆపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా కౌన్సిల్ రద్దవుతుంది. ఇదిలా ఉంటే కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత సంఖ్యా బలం లేనందున తీర్మాన కాపీపై సంతకాలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరిగినట్లు సమాచారం.
రేసులో ఉంటుందా?!


