బొగ్గు టిప్పర్ ఢీకొని మహిళ మృతి
రుద్రంపూర్: బొగ్గు టిప్పర్ ఢీకొని గురువారం ఓ మహిళ మృతి చెందింది. రామవరం ప్రశాంతి నగర్‌కు చెందిన కొమ్ము సరోజ(65) నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రార్థన చేసేందుకు చర్చికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా రామవరంలోని సింగరేణి సివిల్ ఆఫీస్ వద్ద ఆర్‌పీహెచ్‌పీ నుంచి కోయగూడెం వెళ్తున్న బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆమె కాలు నుజ్జునుజ్జయి కుప్పకూలింది. స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా హైవే పక్కన ఫుట్‌పాత్ లేకపోవడం, బొగ్గు టిప్పర్ అతి వేగమే ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. రామవరంలోని ఎస్సీబీనగర్ వద్ద గత నెల 17న బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. ఐషర్ వాహనాన్ని, విద్యుత్ టవర్‌ను ఢీకొట్టింది. 15 రోజులు గడవక ముందే మరో ప్రమాదం జరిగి ఓ మహిళ మృతి చెందింది. ఇప్పటికై నా సింగరేణి, పోలీస్ అధికారులు స్పందించి బొగ్గు లారీల వేగాన్ని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.
బావిలో పడి వ్యక్తి ..
ఇల్లెందురూరల్: మండలంలోని మామిడిగూడెం గ్రామపంచాయతీ సీతానగరానికి చెందిన చంద్రమౌళి (50) గురువారం బావిలో పడి మృతి చెందాడు. సాయంత్రం ఇంటి ఆవరణలో ఉన్న చేదబావిలో జారి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై బయటకు తీశారు. అయితే అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
గుండెపోటుతో రైతు ..
తల్లాడ: ఓ రైతు పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్లే క్రమాన స్నేహితులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పి బయలుదేరుతుండగా గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది. తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన దొడ్డ నరేందర్(40) పిల్లలు చదువుల నిమిత్తం ఖమ్మంలో నివసిస్తుండగా, స్వగ్రామంలో ఉన్న పదెకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై గురువారం గ్రామానికి వచ్చిన ఆయన పొలం వద్దకు వెళ్లగానే గుండెల్లో నొప్పిగా ఉండడంతో తిరిగి ఖమ్మం బయలుదేరాడు. మార్గమధ్యలో యూనియన్ బ్యాంకులో పని చూసుకుని స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాక ఖమ్మం వెళ్తుండగా రెడ్డిగూడెం సమీపాన రెండోసారి తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది. దీంతో రోడ్డు పక్కనే కుప్పకూలిన ఆయనను స్థానికులు 108అంబులెన్స్‌లో ఖమ్మం తరలిస్తుండగా మరణించాడు. కాగా, నరేందర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రెండు బైక్‌లు ఢీకొని ఒకరు..
చుంచుపల్లి: మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... సింగరేణి ఉద్యోగి మీస లక్ష్మీనారాయణ(55) విధులు ముగించుకుని కొత్తగూడెం బైపాస్ రోడ్డు మీదుగా ఇంటి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలై లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నా రు. మరో బైక్‌పై ఉన్నవారికీ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కత్తితో పలువురిపై దాడి
ఖమ్మంరూరల్: ముదిగొండ మండలం సువర్ణాపురానికి చెందిన గంజుతారి మోహన్ పలువురిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కోటనారాయణపురంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కోటనారాయణపురానికి చెందిన పోస్టల్ ఉద్యోగి ఏసు మణికంఠం బుధవారం రాత్రి తన స్నేహితుడు ఎస్‌కే.అబ్దుల్‌తో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమాన హోటల్ వద్ద మోహన్ వీరితో ఘర్షణకు దిగగా మణికంఠం తన బావ రామకృష్ణకు ఫోన్‌లో చెప్పగా ఆయన చేరుకున్నాడు. ఈక్రమాన మోహన్ ముగ్గురిపై కత్తితో దాడి చేశారు. ఆ సమయంలో సాయికుమార్ గొడవను ఆపేందుకు యత్నిస్తే ఆయనపైనా దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఘటనపై బాధితుల ఫిర్యాదుతో మోహన్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
బొగ్గు టిప్పర్ ఢీకొని మహిళ మృతి


