మెరుగైన వేతన ఒప్పందానికి కృషి
బూర్గంపాడు: ఐటీసీ పీఎస్‌పీడీలో మెరుగైన 14వ వేతన ఒప్పందం కోసం యాజమాన్యంపై, గుర్తింపు కార్మిక సంఘంపై ఒత్తిడి తీసుకువచ్చేలా పోరాటాలను కొనసాగిస్తామని కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ సానికొమ్ము శంకర్‌రెడ్డి అన్నారు. గురువారం సారపాక ఐటీసీ పీఎస్‌పీడీలోని బీఆర్‌టీయూ, సీఐటీయూ, బీఎంఎస్, ఏఐటీయూసీ, టీఈయూ, ఐఈయూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్గనైజేషన్లు జేఏసీగా ఏర్పడ్డాయి. జేఏసీ ఆధ్వర్యంలో ఐటీసీ యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గుర్తింపు సంఘం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ మల్లికంటి వెంకటేశ్వర్లు, ముఖ్యనేతలు బిజ్జం అశోక్‌రెడ్డి, సింగంనేని ప్రసాద్, టీ వెంకటేశ్వర్లు, ఎస్‌కే షైక్‌షావలి, కే నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.


