జనవరి 4న ‘గురుకుల’ స్వర్ణోత్సవాలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన బాలుర గురుకుల పాఠశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2026 జనవరి 4న స్వర్ణోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పాఠశాల ప్రాంగణంలో నిర్వహణ కమిటీ సభ్యులు సోమవారం సమావేశమై చర్చించారు. ఈనెల 28వ తేదీనే వేడుకలు జరపాలని భావించినా.. భద్రాలచంలో తెప్పోత్సవం, ముక్కోటి వేడుకల నేపథ్యంలో వారం రోజుల పాటు వాయిదా వేశారు. పూర్వ విద్యార్థులంతా హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ రమేష్, పూర్వ విద్యార్థులు ఎస్.చక్రవర్తి, ఖాదర్, రమేష్‌రెడ్డి, ధారవత్ వెంకన్న, బుర్ర అశోక్, సత్యనారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ స్కూల్‌లో నిర్మాణాలకు ప్రతిపాదనలు..
కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్‌లో అదనపు గదులు, ప్రహరీ, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదలను పంపిస్తామని గిరిజన సంక్షేమ శాఖ ఈఈ టి.మధుకర్ తెలిపారు. సోమవారం ఆయన పాఠశాలను సందర్శించారు. ఆయనవెంట హెచ్‌ఎం చందు ఉన్నారు. కాగా, గిరిజన బాలుర గురుకుల కళాశాల, పాఠశాలను ఆర్‌సీఓ బి.అరుణకుమారి సోమవారం సందర్శించారు. అవసరమైన సౌకర్యాలు, మరమ్మతులపై ప్రిన్సిపాళ్లతో చర్చించారు.


