● ప్రశ్నించేవారినే ఎన్నుకోవాలి
గుండాల: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏజెన్సీలో అభివృద్ధి కావాలంటే ప్రశ్నించే, పోరాడేవారినే ఎన్నుకోవాలని, అందుకే మాస్‌లైన్(ప్రజాపంథా) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అజ్ఞాతంలో బాటన్న, కోటన్న, లింగన్న బాటలో సమస్యలపై పోరాడిన వ్యక్తి ఈసం శంకరన్న సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాడని, ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపంచాలని కోరారు. అధికారులు అధికారపార్టీకే మద్దతుగా నిలిచినట్లుగా తెలుస్తోందని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చండ్ర అరుణ, అభ్యర్థి ఈసం శంకర్, మాచర్ల సత్యం, సుగుణారావు, క్రిష్ణ, శాంతయ్య, జగన్, సాంబయ్య, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.
మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు


