పెద్దమ్మతల్లి ఆలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయ పవిత్రత, భక్తుల శ్రేయస్సు కోసం ఈ ఉత్సవాలు జరుపుతున్నామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు.
నేడు నెట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: సీనియర్స్ విభాగంలో ఉమ్మడి జిల్లాస్థాయి పురుషులు, మహిళల నెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం జరగనున్నాయి. ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో ఈ పోటీలు జరుగుతాయని నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎన్.ఫణికుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు వెంట తీసుకుని ఉదయం 9గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ల నూతన కార్యవర్గం
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ డేటా ఎంట్రీ ఆపరేటర్ల నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఖమ్మంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో మూడేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా ఆర్.సంపత్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా పి.ఉపేందర్, కోశాధికారిగా ఏ.రాము, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకాష్ ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా సురేష్, భార్గవ్, సీహెచ్.ప్రభుకిషోర్, సంయుక్త కార్యదర్శులుగా ప్రభుదాస్, కె.కవిత, ప్రియ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.ఉమాశంకర్, లోకేష్, వసంత్, ప్రచార కార్యదర్శిగా ఎస్.డీ.గౌసియాబేగం, కార్యవర్గ సభ్యులుగా ఝాన్సీ, సంధ్య, కౌసల్య ను ఎన్నుకున్నారు.
ప్రశాంతంగా
నవోదయ ప్రవేశ పరీక్ష
కొత్తగూడెంఅర్బన్: ఖమ్మం జిల్లా పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశాలకు జిల్లాలో శనివారం పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,852 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,472 మంది మాత్రమే హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి తెలిపారు. కొత్తగూడెంలోని పలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా పరిశీలకులు ఆర్.సాంబశివరావు తెలిపారు.
అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయండి
భద్రాచలంఅర్బన్ : భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్‌ను బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు సారపాక ఐటీసీ గెస్‌హౌస్‌లో వారు న్యాయమూర్తికి వినతిపత్రం అందజేశారు. భద్రాచలం, మణుగూరు ప్రాంతాల నుంచి 600 పైగా సెషన్స్ ట్రయల్ కేసులు కొత్తగూడెంలో పెండింగ్ ఉన్నాయని, ఏజెన్సీ ప్రాంతంలో నివసించే నిరుపేదలు అంతదూరం వెళ్లాలంటే ఆర్థిక భారం అవుతోందని వివరించారు. గిరిజనులకు సత్వర న్యాయం అందించాలంటే భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు అవసరమని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. లేదంటే కొత్తగూడెం నుంచి ఒక అదనపు సెషన్స్ కోర్టును భద్రాచలానికి మార్చాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటా దేవదానం, ఉపాధ్యక్షుడు సున్నం రమేష్, జనరల్ సెక్రటరీ పుసాల శ్రీనివాస్, న్యాయవాదులు కొడాలి శ్రీనివాసన్, టి.చైతన్య, మోహన్‌కృష్ణ, బి.రామకృష్ణ తదితరులు ఉన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు
పెద్దమ్మతల్లి ఆలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు


