ఇసుక రీచ్‌లకు అనుమతి
జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌లకు అనుమతి ఇచ్చినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలుకు నిఘా బృందాలను నియమించారు. తొలి విడతలో ఏకగ్రీవాలు మినహాయించి 145 జీపీలు,1,097 వార్డులకు, రెండో విడతలో 155 జీపీలు, 1,834వార్డులు, మూడో విడతలో 155 జీపీలు,1,330 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి విడతలో 4,457, రెండో విడతలో 4,137, మూడో విడతలో 3,913 మంది సిబ్బంది సేవలను అందించనున్నారు. 73 మందితో ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు (ఎఫ్‌ఎస్‌టీ), 62 మందితో స్టాటిస్టికల్ సర్వేలైన్ బృందా (ఎస్‌ఎస్‌టీ)లు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఇప్పటికే మద్యం, నగదు తరలింపు, పంపిణీపై నిఘా పెట్టాయి. తనిఖీలు చేపడుతున్నాయి. ఎస్‌ఎస్‌టీ బృందంలో తహసీల్దార్, నలుగురు పోలీసు సిబ్బంది, వీడియోగ్రాఫర్ ఉండగా, జిల్లా, మండల సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో, ప్రచార సమయంలో కోడ్ ఉల్లంఘన, నియమావళి పాటించకపోవడంపై వచ్చే ఫిర్యాదులపై ఈ బృందాలు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటాయి.


