● నాడు ఎంపీపీ.. నేడు సర్పంచ్‌గా...
పాల్వంచరూరల్: ఇరవై ఏళ్లక్రితం ఐదేళ్ల పాటు మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన నేత ఇప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా బరిలోకి దిగారు. పాల్వంచ మండలం దంతలబోరు గ్రామపంచాయతీ పరిధి గంగాదేవిగుప్ప గ్రామానికి చెందిన కాక శ్రీను 2001లో ఎంపీటీసీగా గెలుపొంది 2006 వరకు ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించాడు. ప్రస్తుతం దంతలబోరు గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఈనెల 2వ తేదీన నామినేషన్ వేశాడు.
నేలకొండపల్లి: గ్రామపంచాయతీలు రెండు రకాలుగా ఉంటాయి. వార్షిక ఆదాయం రూ.60 వేల కంటే ఎక్కువ ఉండడంతో పాటు గ్రామ జనాభా 10వేలు దాటితే వాటిని నోటిఫైడ్ గ్రామ పంచాయతీలుగా వ్యవహరిస్తారు. వీటినే మేజర్ పంచాయతీలుగా పేర్కొటారు. ఈ పంచాయతీలకు నిధులు ఎక్కువగా రావడంతో విధులు నిర్వహించే సిబ్బంది ఎక్కువగా ఉంటారు.


