ఎన్నికల విధులకు 12,507
మూడు విడతలకు పూర్తయిన నియామకం
జిల్లాలోని 4,242 పోలింగ్ కేంద్రాల్లో విధులు
మంది
చుంచుపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమయ్యారు. ఉన్నతాధికారులు సిబ్బందికి విధులు కేటాయించారు. ఈ నెల 11,14,17 తేదీల్లో 4,242 పోలింగ్ కేంద్రాల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు దఫాలుగా ఆర్వోలు, ఏఆర్వోలు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, ఇతర టెక్నికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వీరితోపాటు జోనల్ అధికారులు, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, నిఘా బృందాల సభ్యులు సేవలందించనున్నారు. ఉద్యోగి పనిచేసే చోటు, సొంత నివాస మండలాన్ని పరిగణనలోకి తీసుకుని వేరే మండలంలో విధులు కేటాయించారు. కొందరికి ఒకే విడతలో, అవసరాన్ని బట్టి మరికొందరికి రెండు విడతల్లోనూ విధులు అప్పగించారు. జిల్లాలోని 471 పంచాయతీలు, 4,168 వార్డు స్థానాలు ఉండగా, 12,507 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అదనంగా 20 శాతం సిబ్బందిని రిజర్వులో ఉంచుతారు.
200 మంది ఓటర్లకు ముగ్గురు సిబ్బంది
పోలింగ్ కేంద్రంలో 200 మంది ఓటర్లు ఉంటే ముగ్గురు(1+2) చొప్పున సిబ్బంది ఉంటారు. ఇందులో ఒకరు పీఓ, మరొకరు ఏపీఓ, అదనపు పోలింగ్ అధికారి విధులను నిర్వర్తిస్తారు. 200 నుంచి 400 మంది వరకు ఓటర్లు ఉంటే (1+3) ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. ఇక 400 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో నలుగురు (1+4) సిబ్బందిని నియమిస్తారు. వీరితోపాటు ప్రతీ పోలింగ్ కేంద్రంలో అవసరాన్ని బట్టి ఇతర సపోర్టింగ్ స్టాఫ్‌ను కూడా నియమిస్తారు. పంచాయతీ ఎన్నికల కోసం 4,242 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,758 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. కాగా ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ) కీలకంగా వ్యవహరించనున్నారు.
పంచాయతీ పోలింగ్‌కు సిబ్బంది కేటాయింపు


