మూడో విడతలో రెండో రోజు 1,150 నామినేషన్లు..
మండలాల వారీగా నామినేషన్ల వివరాలు
చుంచుపల్లి: మూడో విడత ఎన్నికలు జరగనున్న 155 గ్రామ పంచాయతీలు, 1,330 వార్డులకు నామినేషన్ల స్వీకరణ ఊపందుకుంది. గురువారం పలు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు భారీగా నామినేషన్లు వేశారు. రెండో రోజు ఏడు మండలాల పరిధిలో 1,150 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచ్ స్థానాలకు 265 మంది, వార్డు స్థానాలకు 885 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లకు శుక్రవారంతో గడువు ముగియనుంది.
మండలం సర్పంచ్ వార్డు
ఆళ్లపల్లి 18 61
గుండాల 20 95
జూలూరుపాడు 27 103
లక్ష్మీదేవిపల్లి 42 206
సుజాతనగర్ 21 55
టేకులపల్లి 65 146
ఇల్లెందు 72 219


