క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో రాణించాలి

Dec 5 2025 6:44 AM | Updated on Dec 5 2025 6:44 AM

క్రీడ

క్రీడల్లో రాణించాలి

గుండాల: విద్యార్థులు అన్ని క్రీడల్లో రాణించాలని గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కాచనపల్లి స్పోర్ట్స్‌ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నాక మాట్లాడారు. ప్రభుత్వం నుంచి వచ్చే మెనూ, దుస్తులు, కాస్మోటిక్స్‌ సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీసి ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంటర్మీ డియట్‌ కాలేజ్‌ కావాలని విద్యార్థులు విన్నవించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు, దమ్మపేట ఏటీడీఓ భారతీ దేవీ, చంద్రమోహన్‌, భద్రాచలం క్రీడల అధికారి గోపాల్‌రావు, ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం పద్మ, వార్డెన్‌ గుమ్మడి పాపయ్య, పీడీ శిరోమణి తదితరులు పాల్గొన్నారు.

హోటళ్లలో నాణ్యతా తనిఖీలు

భద్రాచలంటౌన్‌: పట్టణంలోని దేవస్థానం పరిసరాలు, బ్రిడ్జి సెంటర్‌, కూనవరం రోడ్డులోని హోటళ్లను జిల్లా ఆహార భద్రత అధికారి శరత్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా వంటగదిలో ఉంచిన 10 కేజీల చికెన్‌, 20 కేజీల టమాటో గ్రేవీ, 5 కేజీల చిల్లి గ్రేవీ, 12 కేజీల రెడీ చిల్లీ గ్రేవీని స్వాధీనం చేసుకుని, నమూనాలను పరీక్షల కోసం సేకరించారు. నాణ్యత మెరుగుపరుచుకోవాలని హోటల్‌ యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముక్కోటి వేడుకల నేపథ్యంలో హోటళ్లలో నాసిరకమైన ఆహార వస్తువులను అందించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ఫుడ్‌ సేఫ్టీ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

గిరిజన విద్యార్థినికి

పీఓ అభినందన

భద్రాచలంటౌన్‌: భద్రాచలం పట్టణానికి చెందిన గిరిజన విద్యార్థిని మడివి గురుత్వ సమంద సింగ్‌కు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనంలో అవకాశం లభించడంపై ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ అభినందించారు. ఈమేరకు గురువారం విద్యార్థినిని, ఆమె తల్లిదండ్రులను సన్మానించి మాట్లాడారు. రాజుపేట కాలనీలోని యజాజ్ఞ మోడల్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న గురుత్వ.. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యాన వర్చువల్‌గా జరిగిన బాల సాహిత్య భేరి కార్యక్రమంలో పాల్గొని 101 మంది తెలుగు విద్యార్థుల సమక్షంలో మూడు నిమిషాల పాటు కోయ ఇలవేల్పుల పండగ గురించి తెలుగులో వినిపించి ప్రశంసలు అందుకుందన్నారు. విద్యార్థినిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ చదువుతో పాటు సాహిత్యం, కళల పట్ల ఆసక్తి చూపాలని పీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ ఉషారాణి, శ్రీదేవి, ఉపాధ్యాయురాలు భవాని తదితరులు పాల్గొన్నారు.

108లో మహిళ ప్రసవం

పాల్వంచరూరల్‌: పురిటినొప్పులతో బాధ పడుతున్న ఓ గిరిజన మహిళను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకొస్తుండగా మార్గంమధ్యలో ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాలిలా.. మండల పరిధిలోని చంద్రాలగూడెం గ్రామపంచాయతీ తుమ్మలగూడెం గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఈసం సౌజన్య పురిటి నొప్పులు తీవ్రతరం కావడంతో 108లో బుధవారం ఆర్ధరాత్రి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. ఈక్రమంలో పునుకుల గ్రామం వద్ద నొప్పులు ఎక్కువై అంబులెన్స్‌లోనే ఈఎంటీ ఉమాదేవి గర్భిణికి సుఖప్రసవం చేయగా.. ఆడబిడ్డకు జన్మనిచ్చిందని వాహనం పైలెట్‌ సాయికిరణ్‌ గురువారం తెలిపారు. తల్లీబిడ్డలను ఆస్పత్రిలో చేర్పించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

ట్రాన్స్‌ఫార్మర్లలో

రాగి వైరు చోరీ

కరకగూడెం: మండలంలో రోజు రోజుకు ట్రాన్స్‌ఫార్మర్ల దుండగులు రెచ్చిపోతున్నారు. వారం వ్యవధిలోనే రెండుసార్లు మూడు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేశారు. మండలంలోని మోతె గ్రామంలో రైతులు వారి వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసుకున్న రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి అందులోని రాగి వైరును అపహరించారు. గురువారం ఉదయం పొలానికి వెళ్లిన బాధిత రైతులు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమై ఉండటాన్ని గమనించి విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఇన్‌చార్జ్‌ ఏఈ రాజశేఖర్‌ పరిస్థితిని పరిశీలించి మాట్లాడారు. రూ.80 వేల రాగి వైరుతో పాటు మొత్తం డీటీఆర్‌ నష్టంతో కలుపుకొని సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అనంతరం బాధిత రైతులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

క్రీడల్లో రాణించాలి
1
1/1

క్రీడల్లో రాణించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement