రేషన్‌బియ్యం తరలిస్తున్న లారీడ్రైవర్ అరెస్టు
‘రేషన్’ లోడు పక్కదారి..
8మంది డీలర్లను పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
పాల్వంచరూరల్: నిరుపేదల కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నరకం బియ్యం లారీ లోడును రేషన్ డీలర్లు పక్కదారి పట్టించగా.. టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాలిలా.. పాల్వంచలోని జీసీసీ సివిల్ సప్లయీస్ గోదాం స్టేజీ–1 నుంచి ప్రతి నెలా రేషన్ షాపులకు సన్నరకం బియ్యం సరఫరా జరుగుతుంది. అయితే గోదాంకు వచ్చే సుమారు 250 మెట్రిక్ టన్నుల బియ్యం లారీ లోడును పాల్వంచ పట్టణానికి చెందిన ఎనిమిది మంది డీలర్లు మార్గ మధ్యలో బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలోని మిల్లుకు తరలిస్తుండగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈనెల 2న పట్టుకుని విచారణ జరిపారు. పీడీఎస్ రైస్‌ను మిల్లులో విక్రయించేందుకు ప్రయత్నించారని పక్కా సమాచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓఎస్‌డీ అంజయ్య గురువారం సాయంత్రం ఏకకాలంలో జీసీసీ గోదాంలో బియ్యం స్టాక్‌ను, పట్టణంలోని రేషన్ షాపుల్లో తనిఽఖీలు చేయగా.. స్టాక్, సరఫరాలో తేడాలను గుర్తించారు. దీంతో 8 మంది డీలర్లతో పాటు బియ్యాన్ని గోదాంకు సరఫరా చేసే కాంట్రాక్టర్, అతడి గుమస్తాను పట్టణ పోలీసులకు అప్పగించారు.
చండ్రుగొండ : రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తు లారీతో పట్టుబడిన డ్రైవర్ అరుణ్‌కుమార్ రాజ్‌బార్‌ను గురువారం అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి తెలిపారు. వాహనాల తనిఖీలో భాగంగా ఆంద్రప్రదేశ్ నుంచి ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీ పట్టుబడినట్లు తెలిపారు. లారీ పైభాగంలో రెండు వరుసలు సాధారణ బియ్యం వేసి, కింది భాగంలో మొత్తం రేషన్‌బియ్యం వేసినట్లు సీఐ చెప్పారు. రూ. 5.60 లక్షల విలువ చేసే 250 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్లు వివరించారు. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన లారీ యజమానితో పాటు మరికొందరు ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహెమాన్ నేతృత్వాన లోతైన విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ఏపీలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఛత్తీస్‌ఘడ్‌లో అధిక ధరలకు బియ్యం అమ్ముకుంటూ లాభాలు అర్జిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అక్రమ వ్యాపారులపై చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ శివరామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రేషన్‌బియ్యం తరలిస్తున్న లారీడ్రైవర్ అరెస్టు


