కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి
మణుగూరుటౌన్: రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అన్నారు. బుధవారం మణుగూరులోని ఇల్లెందు అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం ప్రధాన రహదారి నిర్మాణం, నియోజకవర్గంలో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ల మంజూరు కాంగ్రెస్ ఘనతేనని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపా రు. వాజేడు,ఏటూరునాగారంల మధ్య వంతెన నిర్మా ణం కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని గుర్తుచేశారు. బీటీపీఎస్, సింగరేణి, హెవీవాటర్ ప్లాంట్ కార్మికుల కోసం మణుగూరులో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు విజ్ఞప్తి చేయగా, అనుమతి లభించిందన్నారు. కాకతీయ సూపర్‌ఫాస్ట్ మణుగూరుకు పొడిగింపుపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని అన్నారు. మరో 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని చెప్పారు. తొలుత ఆయన అన్నారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు బండ్ల సూర్యం కుటుంబ సభ్యులను పరా మర్శించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఏఎంసీ చైర్మన్ ఆవుల సర్వేశ్వరరావు, పాలమూరిరాజు, బానోత్ లక్ష్మణ్, కుర్రం రవి, సుంకరపల్లి నాగరాజు, వాసంశెట్టి వెంకట్రావు, ఆరిఫ్, యూత్ నాయకుడు ఐతనబోయిన సతీష్, రహీం పాషా, తదితరులు ఉన్నారు.
ఎంపీ బలరాం నాయక్


