ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా చూడాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ అమలు, పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వైద్యసంస్థల నమోదు, నిబంధనల అమలు, సేవల నాణ్యత, ప్రజారోగ్య పరిరక్షణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 46 ప్రైవేట్ ఆస్పత్రులకు శా శ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన వైద్య సిబ్బందితోనే సేవలందించా లని అన్నారు. ప్రతీ ఆస్పత్రిని మూడు నెలలకోసారి తనిఖీ చేయాలని, లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీ ణ ప్రాంతాల్లో శాసీ్త్రయ వైద్యసేవలపై అవగాహన పెంచేందుకు ఆరోగ్య విభాగం, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులు సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
చిన్నారులకు ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి
జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేయించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం విద్య, గ్రామీణాభివద్ధి, బ్యాంకు, పంచాయతీ, తపాలా, మున్సిపల్, రెవె న్యూ శాఖల అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రతీ మండలంలో ఆధార్ నమోదు కేంద్రాలు పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం ఆధార్ కార్డుల సంఖ్య 10,57,427 ఉందని, మార్చిలోగా మిగిలిన వారందరికీ ఆధార్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నెలలో మొదటివారంలో ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో ఆధార్ నమోదు చేయాలని, పాఠశాలల్లో ఆధార్ కార్డు లేని పిల్లల వివరాలను సేకరించి నివేదికలు అందించాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అనంత రం ఆధార్ క్యాంపులను నిర్వహించాలని తెలి పా రు. జిల్లాలో కొందరికి రెండు ఆధార్ కార్డులు మంజూరయ్యాయని, ఆ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మురళి, ఈడీఎం సైదేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, ఇతర అధికారులు బి.ప్రసాద్, నాగలక్ష్మి, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్


