రామాలయంలో ముగిసిన ప్రతిష్ఠ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

రామాలయంలో ముగిసిన ప్రతిష్ఠ వేడుకలు

Nov 27 2025 6:33 AM | Updated on Nov 27 2025 6:33 AM

రామాల

రామాలయంలో ముగిసిన ప్రతిష్ఠ వేడుకలు

ఇల్లెందు: పట్టణంలోని నంబర్‌–2 బస్తీ జగదాంబా సెంటర్‌లో గల శ్రీరామాలయంలో మూడు రోజుల పాటు సాగిన ప్రతిష్ఠ వేడుకలు బుధవారం ముగి శాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు నవగ్రహాలు, నందీశ్వరుడు, శ్రీ గణపతి, శ్రీ దుర్గామాత, దత్తాత్రేయుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. మొదటి రోజు ప్రత్యేక పూజలు, రెండో రోజు మహా అన్నదానం నిర్వహించగా.. చివరి రోజున ప్రతిష్ఠా వేడుకలతో పాటు శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీఎస్పీ చంద్రభాను, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మడత రమా వెంకట్‌గౌడ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ బోగ నందకిశోర్‌ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సంతోష్‌ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.

కలెక్టరేట్‌లో

రాజ్యాంగ ప్రతిజ్ఞ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): రాజ్యాంగ దినో త్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి ప్రతీ ఉద్యోగి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అనంతరం రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, కలెక్టరేట్‌ ఏఓ అనంత రామకృష్ణ, ఉపాధి కల్పనాధికారి కే శ్రీరామ్‌, భూగర్భ జలశాఖాధికారి రమేష్‌, ఇంటర్మీడియట్‌ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నూతన మెనూ

అమలు చేయాలి

పాల్వంచరూరల్‌: గిరిజన హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాల్లో నూతన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ అశోక్‌ ఆదేశించారు. స్థానిక కార్యాలయంలో బుధవారం దమ్మపేట డివిజన్‌ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలు, హా స్టల్‌ వార్డెన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని చెప్పారు. ఉద్దీపకం–2 కార్యక్రమంపై విద్యార్థుల ప్రగతి, అ భ్యాసన స్థితి వివరాలను ఎస్‌సీఆర్‌పీలను అడి గి తెలుసుకున్నారు. డిసెంబర్‌ చివరి వా రంలో ప్రథమ్‌ ఎన్జీఓ సహకారంతో ఉద్దీపకం ఫైనల్‌ టెస్టు నిర్వహించాలన్నారు. ఏటీడీఓ చంద్రమోహన్‌, హెచ్‌ఎంలు, వార్డెన్లు పాల్గొన్నారు.

ఆలయాల్లో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఖమ్మంగాంధీచౌక్‌: ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది దేవాలయాల్లో 19 పోస్టుల భర్తీకి దేవాదాయ, ధర్మాదాయ శాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. అర్చకులు, సహాయ అర్చకులు, వేదాపారాయణులు, డోలు, సన్నాయి, పరిచారిక, పాచక(వంట), సహాయకుల పోస్టులు ఇందులో ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని ఆరు ఆలయాల్లో 13 పోస్టులకు, భద్రాద్రి జిల్లాలోని రెండు ఆలయాల్లో ఆరు పోస్టుల భర్తీకి దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. తెలంగాణ వాసులైన అభ్యర్థులు తగిన విద్యార్హతలు, వృత్తి అర్హతలు కలిగి ఉండడమే కాక 18 – 46 ఏళ్ల మధ్య వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఈఓలు తెలిపారు. దరఖాస్తుదారులకు రాష్ట్ర దేవాదా య శాఖ కమిషనర్‌ నియమించే ఎంపిక కమిటీ రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖమ్మం జిల్లాలో వేంసూరు మండలం కందుకూరులోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, కూసుమంచి మండలం జీళ్లచెరువులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఖమ్మం కాల్వొడ్డులోని శ్రీ సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి ఆలయం, పెనుబల్లి మండలం నీలాద్రిలోని శ్రీ నీలాద్రీశ్వర స్వామి దేవాలయంలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇక భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురంలోని పెద్దమ్మతల్లి ఆలయం, అశ్వారావుపేట మండలం వినాయకపురంలోని శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పోస్టులు ఉండగా, ఆసక్తి ఉన్న వారు వివరాల కోసం ఆలయ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.

గంజాయి స్వాధీనం?

ఇల్లెందు: టేకులపల్లి మండలం సిద్ధారం వద్ద బుధవారం రాత్రి పోలీసులు గంజాయి పట్టుకున్న ట్లు తెలిసింది. కొత్తగూడెం నుంచి సంపత్‌నగర్‌, గుండాల మీదుగా పస్రా వైపు వెళ్తున్న ఓ కా రును పోలీసులు చేజ్‌ చేసి పట్టుకున్నట్లు సమాచారం. గంజాయి తరలిస్తున్న ముఠాను బోడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

రామాలయంలో ముగిసిన ప్రతిష్ఠ వేడుకలు1
1/1

రామాలయంలో ముగిసిన ప్రతిష్ఠ వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement