మార్కెట్లలో హెల్ప్‌డెస్క్‌లు
సీసీఐ కేంద్రాల్లో పత్తిని మద్దతు ధరకు అమ్ముకునేలా రైతుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి సూచించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల మార్కెట్ కార్యదర్శులతో ఖమ్మంలో మంగళవారం ఆమె సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 8 – 12 శాతం తేమ కలిగిన పత్తినే తీసుకొచ్చేలా రైతుల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. అంతేకాక ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునేలా మార్కెట్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ జేడీఎం ఉప్పల శ్రీనివాస్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల మార్కెటింగ్ శాఖ అధికారులు ఎంఏ.అలీం, నరేందర్, ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


