రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్‌లో ప్రతిభ
దుమ్మగూడెం: మండలంలోని సీతారాంపురం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల 11వ తరగతి విద్యార్థిని కీర్తన రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ నెల 17, 18వ తేదీల్లో కల్చరల్ ఫెస్ట్ జరగగా, లోకల్ క్రాప్ట్స్ విభాగంలో కీర్తన రాష్ట్రస్థాయిలో సత్తా చాగింది. మొదటి స్థానంలో నిలిచిన ఆమెను ప్రిన్సిపాల్ విజేందర్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ నీరజ్ యాదవ్, ఆర్ట్ టీచర్ విజయ్, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు.
ఎన్పీడీసీఎల్ ఆర్టిజన్ల జేఏసీ కమిటీ
హన్మకొండ: ఎన్పీడీసీఎల్ పరిధిలో ఆర్టిజన్ల జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు. ఎన్పీడీసీఎల్ కమిటీ కన్వీనర్లుగా శ్రీకాంత్, డి.రవీందర్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు చైర్మన్ ధరావత్ సికిందర్ మంగళవారం వెల్లడించారు. అలాగే, కోకన్వీనర్‌గా జి.అనంతరెడ్డి, కోచైర్మన్‌గా టి.తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్‌గా మహేందర్‌గౌడ్, కోశాధికారులుగా అటికేటి రవీందర్, చింతలపూడి సతీశ్‌కుమార్ ఎన్నికయ్యారని తెలిపారు.
పోస్ట్‌మాస్టర్ ఫొటోతో స్టాంప్
దుమ్ముగూడెం: మండలంలోని చెరుపల్లి గ్రామ వాసి, గతంలో పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వర్తించిన ఆనందం రాజు 80వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫొటోతో పోస్టల్ స్టాంప్ రూ పొందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా స్థానికులు ‘మై ఫొటో – మై స్టాంప్’సేవల కింద రూ.5 విలువైన స్టాంప్ చేయించారు. ఈ స్టాంప్‌ను హైదరాబాద్‌కు చెందిన అధికారి కొడాలి రాజేంద్రబాబు మంగళవారం గ్రామంలో విడుదల చేశారు. అనంతరం ఆల్ ఇండి యా పంచాయత్ పరిషత్ దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ విజయ్‌వర్మ ఆధ్వర్యాన పాకలపాటి జనహితం ఫౌండేషన్‌కు రూ.80వేలు, ఎస్సె స్సీ, ఇంటర్‌లో ప్రతిభావంతులకు రూ.5వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. అలాగే, కొత్తపల్లి విద్యార్థి అపక శ్రీనిధి ఎంబీబీఎస్ సీటు సాధించడంతో రూ.10వేల చెక్కు అందచేశారు. కార్యక్రమంలో ముర్రం వీరభద్రం, దాట్ల వీరభద్రరాజు, కదులూరి హరి, కల్లూరి కొర్రాజు, కొర్సా మారయ్య, రేసు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ బస్సు నిలిపివేత
దుమ్ముగూడెం: చర్ల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను మండలంలోని లక్ష్మీనగరంలో స్థానికులు మంగళవారం రాత్రి నిలిపేశారు. ఈనెల 16న హైదరాబాద్ నుంచి చర్లకు వస్తున్న ప్రైవేట్ బస్సు చిట్యాల – నకిరేకల్ మధ్య ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఘటనలో పలువురికి గాయలయ్యాయి. దీంతో డ్రైవర్ బస్సును వదిలేసి వెళ్లిపోయాడు. క్షతగాత్రులను ఎవరూ పట్టించుకోకపోవడంతో పోలీసులే చికిత్స చేయించి మరో బస్సులో పంపించారు. ఈ మేరకు గాయపడిన లక్ష్మీనగరం గ్రామానికి చెందిన మద్దుకూరి సంకీర్తన తదితరులు మరుసటి రోజు ట్రావెల్స్ సిబ్బందికి ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం అదే ట్రావల్స్ బస్సు వెళ్తుండగా అడ్డుకున్నారు. ఈ మేరకు ప్రయాణికులు ఇబ్బంది పడగా, డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
అన్నదమ్ముల
కుటుంబాల్లో ఘర్షణ
ఇల్లెందురూరల్: చేను వద్ద నీటి పారకం విషయమై అన్నదమ్ముల కుటుంబాల్లో చోటు చేసుకున్న వివాదం ఘర్షణ దాడికి దారితీసింది. మండలంలోని మస్సివాగుకు చెందిన గుగులోత్ లాల్‌సింగ్ నీటి పారకంలో వంతు ప్రకారం మంగళవారం చేనుకు నీళ్లు పెట్టుకుంటుండగా ఆయన వదిన శైలజ, ఆమె తండ్రి మల్సూర్ అసభ్యంగా దూషించారు. ఆపై ఇంటి వద్ద తనపై రాళ్లతో దాడి చేయగా తలకు గాయాలయ్యాయని లాల్‌సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్‌లో ప్రతిభ
రాష్ట్రస్థాయి కల్చరల్ ఫెస్ట్‌లో ప్రతిభ


