‘మోడల్’ గ్రామాలకు
భద్రాదికొత్తగూడెం జిల్లా
కొణిజర్ల, భద్రాచలానికి సిఫారసు
నిధులు వస్తే ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ వెలుగులు
ఖమ్మంవ్యవసాయం: మోడల్ సోలార్ గ్రామాలకు నిర్దేశించినట్లుగా రూ.కోటి నజరానా అందించేలా అధికారులు సిఫారసు చేశారు. కేంద్ర ప్రభుత్వ నూతన, పురుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ(ఎంఎన్‌ఆర్‌ఈ) ఆధ్వర్యాన అమలుచేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన(పీఎం–ఎస్‌జీఎంబీవై) పథకంలో భాగంగా అధిక సోలార్ ప్లాంట్లు కలిగిన గ్రామాలను మోడల్ గ్రామాలుగా ఎంపిక చేశారు. విద్యుత్ సమస్యను అధిగమించడం, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రతీ జిల్లాలో 5వేల జనాభా కలిగిన గ్రామాలకు కేంద్రం ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. 2025 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అధిక ప్లాంట్లు కలి గిన గ్రామాలను పరిగణనలోకి తీసుకుంటా మని వెల్లడించింది. రూ.కోటి ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ పోటీలో ఖమ్మం జిల్లా నుంచి ఎని మిది, భద్రాద్రిజిల్లా నుంచి 14 గ్రామాలు అర్హత సాధించాయి. చివరకు ఖమ్మం జిల్లా నుంచి కొణిజర్ల, భద్రాద్రిజిల్లా నుంచి భద్రాచలం అధిక మొత్తంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తితో ముందు భాగాన నిలిచి రూ.కోటి చొప్పున నజరానాకు అర్హత సాధించాయి. దీంతో జిల్లా స్థాయి కమిటీల ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆపై రూ.కోటి చొప్పున మంజూరయ్యే నిధులను ఆయా గ్రామాల్లో ప్రభు త్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర అవసరాలకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు వినియోగిస్తామని రెడ్‌కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్‌కుమార్ తెలిపారు.
గ్రామం సోలార్ ప్లాంట్లు సామర్థ్యం
భద్రాచలం 208 2,098.15
మందలపల్లి 15 110.09
సారపాక 19 109.1
దమ్మపేట 16 85.4
అశ్వాపురం 14 73.82
ముల్కలపల్లి 02 55
చండ్రుగొండ 02 50
చర్ల 11 49.1
బర్గంపాడు 03 31
సిమితి సింగారం 07 29
నాగినేనిప్రోలు 01 04
రుద్రంపూర్ 01 03
బాబూక్యాంప్ –– ––
కూనవరం –– ––


