జామాయిల్ చెట్ల నరికివేతపై విచారణ
జూలూరుపాడు: జూలూరుపాడు అటవీరేంజ్ పరిధి గుండెపుడి అటవీ బీట్‌లోని ప్లాంటేషన్‌లో జామాయిల్ చెట్లను ఓవ్యక్తినరికిన ఘటనపైటాస్క్ ఫోర్స్ అధికారులు మంగళవా రం విచారణ చేపట్టారు. అనంతారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు జామాయిల్ చెట్లను నరికి ఆయిల్‌పామ్ తోటలో డంప్ చేశాడు. ఈ విషయం తెలియడంతో గుండెపుడి డీఆర్‌ఓ నసూర్‌బీ తనిఖీలు చేపట్టి 84 జామాయిల్ కర్రలు స్వాధీనం చేసుకున్నారు. ఆపై డీఎఫ్‌ఓ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ డీఆర్‌ఓ సలోజ బృందం ప్లాంటేషన్‌లో తనిఖీలు నిర్వహించి చెట్ల మొదళ్లు, కొలతలు నమోదు చేసుకున్నారు. తనిఖీల్లోఎఫ్‌ఆర్‌ఓ జి.ప్రసాద్‌రావు,డీఆర్‌ఓ నసూర్‌బీ, టాస్క్‌ఫోర్స్ ఉద్యోగులు పాల్గొన్నారు.
పశ ువులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు
కూసుమంచి: ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, అక్రమంగా పశువులను మినీ వ్యాన్లలో తరలిస్తున్న ఇద్దరిపై కూసుమంచి పోలీసులు కేసునమోదు చేశా రు. భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కట్టు గూడెంనకు చెందిన ఆవుల కృష్ణయ్య, ఎల్లయ్య రెండు మినీ వ్యాన్లలో పశువులను సూర్యాపేట సంతకు తరలిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున కూ సుమంచి సమీపాన చేపట్టిన తనిఖీల్లో పోలీసులు పరిశీలించగా పశువులను ఒకదానిపై ఒకటి వేసి తాళ్లతో బంధించినట్లు గుర్తించారు. వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కృష్ణయ్య, ఎల్లయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
మట్టి తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్లు సీజ్
జూలూరుపాడు: సీతారామ కెనాల్ మట్టిని అక్రమంగా తరలిస్తున్న జేసీబీ, రెండు ట్రాక్టర్లను పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. మండలంలోని రాజారావుపేట సమీపం నుంచి సీతారామ కాల్వ మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మట్టిని జేసీబీతో తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తుండగా అడ్డుకున్నారు. జేసీబీ, రెండు ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించే క్రమాన జేసీబీ యజమాని అడ్డుకున్నాడు. అంతేకాక జేసీబీ తాళాలను సీతారామ కెనాల్‌లోకి విసిరివేశాడు. దీంతో జేసీబీ అక్కడే ఆగిపోగా, రెండు ట్రాక్టర్లను పోలీసులు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
జామాయిల్ చెట్ల నరికివేతపై విచారణ


