విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి

Oct 22 2025 7:26 AM | Updated on Oct 22 2025 7:26 AM

విద్య

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి

పాల్వంచరూరల్‌: ముత్యాలమ్మ గుడిలోకి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో లైన్‌ క్లియరెన్స్‌ తీసుకోకుండా ఓ ఎలక్ట్రీషియన్‌ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యా డు. అక్కడి నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలై మృతిచెండటంతో దీపావళి రోజే ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. పోలీసుల కథనం మేరకు.. పాండురంగాపురానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ మల్లంసాంబశివరావు (46) సోమవారం వీధిలోని ముత్యాలమ్మతల్లి ఆలయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో స్తంభం ఎక్కి మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుత్‌షాక్‌ తగిలింది. దీంతో స్తంభం మీది నుంచి కిందపడగా తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను తొలుత పాల్వంచ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు సందీప్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్‌ఐ.సురేశ్‌ తెలిపారు.

మేడారంలో నాగినేనిప్రోలు వాసి మృతి

బూర్గంపాడు/ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ములుగు జిల్లా మేడారంలో దైవదర్శనానికి వెళ్లిన బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు ఎస్సీ కాలనీ యువకుడు అక్కడి జంపన్నవాగులో నీట మునిగి మృతి చెందాడు. కాలనీకి చెందిన నలుగురు యువకులు కొద్దిరోజుల క్రితం మేడారంలో దైవ దర్శనానికి వెళ్లారు. అక్కడ వారు ఊరట్టం కాజ్‌వే వద్ద జంపన్నవాగులో స్నానం చేస్తుండగా దానూరి సాయిగౌతమ్‌(17) ప్రమాదవశాత్తు నీట మునిగాడు. ఆయన కోసం గాలించినా ఫలితం లేక కుటుంబీకులకు సమాచారమిచ్చారు. దీంతో వారు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గాలింపు చేపట్టడంతో ఆదివారం కాజ్‌వే వద్ద జంపన్నవాగులో గౌతమ్‌ మృతదేహం లభ్యమైంది. వనదేవతల దర్శనానికి వెళ్లిన గౌతమ్‌.. విగతజీవిగా చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా, ఘటనపై ఆయన సోదరుడు సాయిగణేష్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

ఆర్టీసీ కండక్టర్‌పై దాడి

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం ఆర్టీసీ డిపో కండక్టర్‌ ఉమామహేశ్వరరావుపై మహిళా ప్రయాణికుల కు టుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఖమ్మం నుంచి భద్రాచలం వస్తుండగా పాల్వంచ వద్ద ఓ ఇద్దరు మహి ళా ప్రయాణికులు బస్సు ఎక్కారు. కూర్చోవడానికి ఖాళీ లేదని చెప్పినందుకు సదరు మహిళా ప్రయాణికు లు దిగిపోయారు. తర్వాత ఆ మహిళా ప్రయాణికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం డిపో వద్దకు వచ్చి ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని పట్టుకొని, వారిపై కేసు నమో దు చేయాలని మంగళవారం సాయంత్రం ఆర్టీసీ అధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మోటార్‌ సైకిల్‌,

సెల్‌ఫోన్‌ చోరీ

పాల్వంచ: పట్టణంలోని కుంటినాగూలగూడెం సమీపంలోని వెంకటేశ్వర క్రాకర్స్‌ వద్ద టపాసులు కొనేందుకు వచ్చిన గట్టాయిగూడెంనకు చెందిన ఉదయ్‌ మోటార్‌ సైకిల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. టపాసులు కొనుగోలు చేసి వచ్చేసరికి బైక్‌ కనిపించక పోడంతో చోరీకి గురైనట్లు గుర్తించారు. కాగా, పట్టణంలోని శాసీ్త్రరోడ్‌లో బియ్యం దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు నటించి అక్కడి గుమస్తాకు చెందిన ఐఫోన్‌ను చోరీ చేశాడు. చోరీ చేసిన తీరును సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విద్యుదాఘాతంతో  ఎలక్ట్రీషియన్‌ మృతి 1
1/1

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement